కేరళ వరద బాధితులకు కడియం కావ్య సాయం

Tue,August 21, 2018 07:15 PM

Kadiyam Kavya help to Kerala flood victims

వరంగల్: కూడు, గూడు, గుడ్డకు కూడా ఎదురు చూసే పరిస్థితుల్లో ఉన్న కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు తన వంతు సాయంగా విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి కూతురు డాక్టర్ కడియం కావ్య ముందుకు వచ్చారు. డాక్టర్ గా చేరి  నెల రోజులే అవుతున్నా కడియం కావ్య తన మొదటి నెల వేతనంతో పాటు వచ్చే నెల వేతనాన్ని కూడా కలిపి రెండు నెలల మొత్తాన్ని చెక్ రూపంలో కేరళ బాధితుల సాయం కోసం వరంగల్ అర్భన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలికి భర్త డాక్టర్ నజీర్, కూతురు దియాతో కలిసి అందించారు. ఇప్పటికే కడియం ఫౌండేషన్ ద్వారా పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థిని, విద్యార్థులు, వికలాంగులు, వృద్ధులు, అనాథల కోసం కావ్య పనిచేస్తున్నారు. పేదల కాలనీల్లో ఆరోగ్య క్యాంపులు, బాలికలకు హైజీన్ కిట్స్, విద్యార్థినిలకు నోట్ బుక్స్, స్కూల్ బ్యాగ్స్, వృద్ధులకు కావల్సిన సామాగ్రి అందిస్తూ స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

7151
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles