కడెం ప్రాజెక్ట్ గేటు మరమ్మతులు దిగ్విజయంగా పూర్తి

Tue,August 21, 2018 07:59 PM

KADEM Project gate struck up issue solved

హైదరాబాద్: కడెం ప్రాజెక్టు గేటు మరమ్మతులు దిగ్విజయంగా పూర్తి అయ్యాయి. ఈ నెల 16 న కడెం ప్రాజెక్టు రెండో నెంబర్ గేట్ తో పాటు ఇతర గేట్లు పైకెత్తి వరద నీటిని దిగువకు విడుదల చేసే సమయంలో గేట్ కౌంటర్ వెయిట్ తెగిపోయింది. ఈ కారణంగా నీటి ఒత్తిడికి గేట్ పక్కకు ఒరిగి కిందకి తిరిగి దిగని పరిస్థితి ఏర్పడింది. ఇతర గేట్లు దించినప్పటికీ.. ప్రాజెక్టు రెండో గేట్ వేయలేని పరిస్థితి ఏర్పడ్ంది. దీని వల్ల రెండో నెంబర్ గేట్ ద్వారా రోజూ 5000 క్యూసెక్కుల నీరు వృధాగా పోయింది. అయితే 18.30 m X 6.30m సైజులో దాదాపు 50 టన్నులు ఉన్న ఈ గెట్ కారణంగా ఏర్పడిన సమస్యను ఇంజనీర్లు చాకచక్యంగా పరిష్కరించారు. వంద టన్నుల బరువు ఉన్న హైడ్రాలిక్ జాక్ తోను, చైన్ బకిల్, క్రేన్ వంటి సాధనాలతో గేట్ పై ఒత్తిడి కలుగజేసి పూర్వ స్థితిలో గేట్ మూసేలా చేశారు. ప్రాజెక్టు ఇంజనీర్లు చీఫ్ ఇంజనీర్ శంకర్ ఆధ్వర్యంలో రెండు రోజులు శ్రమించి జయప్రదంగా గేటును కిందకి దించి మూసివేసారు. ఈ సాంకేతిక పనిలో నీటి పారుదల శాఖ సలహాదారు కన్నయ్య నాయుడు, ఈఈ సంజీవ్, స్వప్న ఇన్ ఫ్రా కు చెందిన ఫిట్టర్లు, టెక్నికల్ సిబ్బంది, బెకామ్, మెకానికల్ డివిజన్ ఆఫ్ పీడబ్ల్యూ వర్కు షాప్ సిబ్బంది పాల్గొన్నారు. అయితే ఈ గెట్ ను తిరిగి పైకెత్తే పరిస్థితి లేదు. ఈ సీజన్లో ఈ రెండో నెంబరు గేట్ పూర్తిగా మూసి వేయాలని ఇంజనీర్లు నిర్ణయించారు. వేసవిలో తిరిగి ఈ గెట్ పైకెత్తి, తిరిగి కిందకు దించేలా మరమ్మత్తులు చేపట్టనున్నారు. ఈ ఆపరేషన్ జయప్రదంగా జరిపినందుకు ఇంజనీర్లకు, సాంకేతిక నిపుణులకు, వర్కర్లకు మంత్రి హరీష్ రావు అభినందనలు తెలిపారు.

2382
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles