అక్టోబర్ 4న పరీక్ష‌.. దరఖాస్తు గడువు పెంపు

Tue,September 11, 2018 05:29 PM

Junior panchayat secretary apply date extended

హైదరాబాద్: జూనియర్ పంచాయతీ కార్యదర్శి దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది. నిజానికి ఫీజు చెల్లింపుకు ఈరోజే చివరి తేదీ, దరఖాస్తుకు రేపు చివరి తేదీ. దరఖాస్తులో ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా ప్రభుత్వం గడువును పొడిగించాలని నిర్ణయం తీసుకున్నది. ఫీజు చెల్లింపుకు ఈనెల 14 వ తేదీ, దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 15 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాత పరీక్ష‌ను అక్టోబర్ 4న నిర్వహించనున్నట్లు తెలిపింది. మంత్రి జూపల్లి కృష్ణారావు సూచనలతో గడువు పొడిగిస్తూ నియామక ప్రక్రియ కమిటీ కన్వీనర్ నీతూ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

12568
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles