విషాద వదనంతో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్

Wed,August 29, 2018 10:02 AM

Junior NTR and Kalyan Ram were in grief

నల్లగొండ: జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ తీవ్ర విషాదంలో మునిగారు. తండ్రి నందమూరి హరికృష్ణను చూసేందుకు ఇరువురు అన్నదమ్ములు నార్కెట్‌పల్లి కామినేని ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ తెల్లవారుజామున కారు ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన హరికృష్ణను చికిత్స నిమిత్తం కామినేని ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. పరిస్థితి విషమించడంతో ఆయన చనిపోయారు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి బయల్దేరి వెళ్లారు. దగ్గుబాటి వెంకటేశ్వరావు, పురందేశ్వరి సైతం కామినేని ఆస్పత్రికి చేరుకున్నారు. ఇటు హైదరాబాద్ మోహదిపట్నంలో గల హరికృష్ణ ఇంటికి నారా భువనేశ్వరి, బ్రహ్మణి చేరుకున్నారు.

6694
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles