వెబ్‌సైట్‌లో జూనియర్ కాలేజీల జాబితా

Tue,July 10, 2018 09:15 PM

Junior colleges list in website says Ashok kumar

హైదరాబాద్: రాష్ట్రంలో 2018-19 విద్యాసంవత్సరానికి సంబంధించి అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్) పొందిన జూనియర్ కాలేజీల జాబితాలను వెబ్‌సైట్‌లో పెట్టినట్ట్టు ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ ఏ అశోక్ తెలిపారు. జిల్లాలవారీగా, మండలాలవారీగా బోర్డు నుంచి గుర్తింపు పొందిన జాబితాలను http://acad.tsbie.telanganga.gov.in అప్‌లోడ్ చేశామని వివరించారు. ప్రైవేటు జూనియర్ కాలేజీలలో ప్రవేశాలు పొందాలనుకున్నవారు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారులు (డీఐఈవో)/నోడల్ అధికారులను సంప్రదించి గుర్తింపు పొందిన కాలేజీల వివరాలు తెలుసుకోవాలని సూచించారు. ప్రైవేటు జూనియర్ కాలేజీలలో కేవలం ఆమోదం పొందినవాటిలో మాత్రమే ప్రవేశాలు తీసుకోవచ్చని తెలిపారు. గుర్తింపులేని కాలేజీలలో చేరితే ఇంటర్‌బోర్డు బాధ్యత వహించదని బోర్డు సెక్రటరీ స్పష్టంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,400 కాలేజీల వరకు అఫిలియేషన్ పొందాయి.

2694
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles