టీఆర్‌ఎస్‌లోకి కొనసాగుతున్న వలసలు

Wed,October 3, 2018 12:27 PM

Joinings in TRS party

హైదరాబాద్: విపక్ష టీడీపీ, కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార టీఆర్‌ఎస్ ప్రభుత్వంలోకి వలసలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు మాజీ ఎంపీటీసీ లక్ష్మణ్ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. హైదరాబాద్‌లో గల నివాసంలో మంత్రి మహేందర్‌రెడ్డి వీరందరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అదేవిధంగా జనగామ జిల్లా పాలకుర్తి మండలం తిరుమలగిరి గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

909
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles