ఈఎంఆర్‌ఐ కాల్ సెంటర్‌లో ఉద్యోగాలు

Sat,July 13, 2019 07:23 AM

Job vacancy in EMRI call center

-16, 17 తేదీల్లో ఇంటర్వ్యూలు
హైదరాబాద్ : జీవీకే - ఈఎంఆర్‌ఐలో కాల్ సెంటర్ కాల్ సెంటర్‌లో ఎమర్జెన్సీ రెస్పాన్స్‌డ్ ఆఫీసర్, పైలెట్ల (డ్రైవర్) నియామకానికి ఈ నెల 16, 17 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్ హెడ్ సుహాస్‌చరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. 16న ఎమర్జెన్సీ రెస్పాన్స్‌డ్ ఆఫీసర్లు, 17వ తేదీన పైలెట్ పోస్టులను ఇంటర్వ్యూలను నిర్వహించనున్నామని ఆయన తెలిపారు. ఇంటర్వ్యూలను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జీవీకే -ఈఎంఆర్‌ఐ, కింగ్‌కోఠి జిల్లా దవాఖాన ప్రారంగణంలోని 108 ఆఫీసులో నిర్వహిస్తామని, ఇతర వివరాల కోసం 79950 61518 నెంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

పైలెట్ ఉద్యోగాలకు ఎస్సెస్సీ ఉత్తీర్ణలయ్యి, ఎల్‌ఎంవీ విత్ ట్రాన్స్‌ఫోర్ట్ బ్యాడ్జ్ లైసెన్స్, హెచ్‌టీవీ లైసెన్స్ కలిగి ఉండి, డ్రైవింగ్‌లో మూడేండ్ల అనుభవం, వయస్సు 22-35 ఏండ్లు, ఎత్తు 5.4 అంగులములు, తెలుగు, ఇంగ్లీష్‌లో చదవడం, రాయడం వచ్చి, వర్ణ అంధత్వం లేని వారు అర్హులని తెలిపారు. ఎంపికైన వారు తెలంగాణలో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. ఆశావాహులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో సహా ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు.

ఎమర్జెన్సీ రెస్పాన్స్‌డ్ ఆఫీసర్‌కు అర్హతలు..
బీఎస్సీ లైఫ్ సైన్సెన్ డిగ్రీ చదివి, తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో చదవడం, రాయడం వచ్చి, 30 ఏండ్ల మధ్య వయస్కులు ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చని వెల్లడించారు. ఎత్తుకు తగిన బరువు, శారీర దారుఢ్యం కలిగి ఉండాలని, ఎంపికైన వారు తెలంగాణలో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుందన్నారు.

900
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles