రేపు మల్లేపల్లి ఐటీఐలో జాబ్‌మేళా

Wed,September 25, 2019 07:40 AM

హైదరాబాద్ : జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలను కల్పించుటకు ఈ నెల 26 (గురువారం) విజయ్‌నగర్ కాలనీలోని మల్లేపల్లి ఐటీఐ క్యాంపస్ వద్దనున్న జిల్లా ఉపాధి కార్యాలయంలో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి మైత్రిప్రియ తెలిపారు. పేటీఎం, రిలయన్స్ డిజిటల్, చోళ ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్, కాలిబర్, ఫిన్స్ రూరల్ డెవలప్‌మెంట్ సర్వీసెస్, ఆర్‌బీఎల్ ఫిన్ సర్వ్ లిమిటెడ్ తదితర ప్రైవేట్ కంపెనీలలో హైదరాబాద్ నందు పని చేయుటకు దాదాపు 500 ఉద్యోగాల ఎంపికకు జాబ్ మేళా నిర్వహించనున్నామని పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు పదో తరగతి, ఇంటర్మీడియేట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, పీజీ చదివిన అభ్యర్థులు అర్హులు అని తెలిపారు. అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఫీల్డ్ టెక్నిషియన్, హెల్పర్స్, ఎలక్ట్రిషియన్, ఎబీఎం మొదలగు ఉద్యోగాల కోసం ఈ జాబ్‌మేళా నిర్వహిస్తున్నామన్నారు. ఎంపికైన వారికి రూ. 9 వేల నుంచి రూ.18 వేల వేతనం ఉంటుందన్నారు. అభ్యర్థుల వయసు 18-35 సంవత్సరాల లోపు పురుషులు, స్త్రీలు అర్హులని, ఆర్హత ఆసక్తి గల జిల్లా నిరుద్యోగ యువతీ, యువకులు తమ బయోడేటాతో పాటు విద్యార్హతల సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలతో గురువారం మల్లేపల్లి బాలుర ఐటీఐ క్యాంపస్ జిల్లా ఉపాధి కార్యాలయం ఉదయం 10 .30 గంటలకు హాజరు కావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు టి. రఘుపతిని ఫోన్ నం. 8247656356 సంప్రదించవచ్చన్నారు.

1352
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles