నిరుద్యోగులకు రేపు జాబ్‌మేళా

Wed,September 18, 2019 06:40 AM

హైదరాబాద్ : నిరుద్యోగ యువతీ, యువకులకు వివిధ ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు హైదరాబాద్ జిల్లా ఉపాధి కార్యాలయంలో గురువారం మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్టు హైదరాబాద్ జిల్లా ఉపాధి అధికారి ఎన్.మైత్రిప్రియ తెలిపారు. నగరంలోని స్టార్ హాస్పిటల్స్ , అపోలో హోమియోకేర్ , నవతరోడ్ ట్రాన్స్‌పోర్ట్, వే సాఫ్ట్ టెక్నాలజీస్ , శ్రీరాం చిట్స్ తదితర సంస్థల్లో 400 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు తెలిపారు. పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ , ఏఎన్‌ఎం , జీఎన్‌ఎం , బీఎస్సీ నర్సింగ్ చదివిన అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ.10 వేల నుంచి రూ.18 వేల వేతనం చెల్లిస్తారని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు 19న విజయనగర్ కాలనీలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో నిర్వహించే జాబ్‌మేళాకు బయోడేటాతో హాజరుకావాలని, వివరాలకు 8247656356 లో సంప్రదించాలని పేర్కొన్నారు.

3563
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles