ఆక్వా కల్చర్ ఎక్స్‌పోకు తరలిన జనగామ మత్య్సకారులు

Sat,March 17, 2018 12:52 PM

Janagama fishermen goes to hyderabad for visiting Aqua Culture Expo

జనగామ: హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరుగుతున్న ఫిషరీస్ ఆక్వా కల్చర్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ ఎక్స్ పోకు జనగామ జిల్లాలోని వివిధ సంఘాల నుంచి 100 మంది మత్స్యకారులు తరలివెళ్లారు. జిల్లా మత్య్సశాఖ అధికారి, సిబ్బందితో పాటు వీరంతా రెండు బస్సుల్లో నగరానికి బయల్దేరారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు బస్స మల్లేశం జెండా ఊపి ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్‌వో శ్రీపతి, జిల్లా డైరెక్టర్స్ నీల రాజు, పిట్టల సత్యనారాయణ తదితరులతో పాటు మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.

1326
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles