ఈవీఎంను ధ్వంసం చేసిన జనసేన అభ్యర్థి అరెస్ట్

Thu,April 11, 2019 12:10 PM

Jana Sena candidate Madhusudan Gupta arrested for damaging EVM

హైదరాబాద్‌ : అనంతపురం జిల్లాలో జనసేన పార్టీ నాయకులు రెచ్చిపోయారు. గుంతకల్‌ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి మధుసూదన్‌ గుప్తా.. గుత్తిలోని ఓ పోలింగ్‌ బూత్‌లో బీభత్సం సృష్టించారు. పోలింగ్‌ బూత్‌లోని ఈవీఎంను ధ్వంసం చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్‌కు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను సరియైన క్రమంలో ప్రచురించకపోవడంతో ఎన్నికల సిబ్బందిపై గుప్తా ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఈవీఎంను నేలకేసి కొట్టారు. దీంతో ఈవీఎం పూర్తిగా ధ్వంసమైంది. అనంతరం మధుసూదన్‌ గుప్తాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

1783
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles