కాంగ్రెస్‌కు జనసమితి డెడ్‌లైన్

Wed,November 14, 2018 03:28 PM

jana samithi puts deadline to Congress

హైదరాబాద్: సీట్ల కేటాయింపుపై కాంగ్రెస్ పార్టీకి జనసమితి డెడ్‌లైన్ విధించింది. ఈ సాయంత్రంలోగా మిర్యాలగూడ, జనగామ సీట్ల కేటాయింపుపై తేల్చాలని అల్టిమేటం విధించింది. మరోవైపు తెలంగాణ ఇంటి పార్టీకి సీట్లు కేటాయించకపోవడంపై ఆ పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఇంటి పార్టీ ఆధ్వర్యంలో అమరుల స్థూపానికి చెరుకు సుధాకర్, చంద్రకుమార్‌లు నివాళులర్పించారు. ఈ సందర్భంగా చెరుకు మాట్లాడుతూ.. కూటమి జాబితా అమరావతిలో తయారవుతుందన్నారు. ఢిల్లీలో బీసీ లీడర్లు పాలెగాళ్లు అయ్యారన్నారు. కూటమి సీట్ల పంపకాల్లో సమాజిక న్యాయమే లేదని దుయ్యబట్టారు.

2872
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles