తండాల్లో జలగం వెంకట్రావు ప్రచారం

Thu,October 11, 2018 03:52 PM

Jalagam Venkat Rao election campaign in Tribal areas

భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగూడెం తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకట్రావు ఇవాళ చుంచుపల్లి తండాలో పర్యటించారు. ఇంటి ఇంటికి తిరిగారు. అందరి యోగ క్షేమాలు తెలుసుకొన్నారు. వృద్ధులతో ఆప్యాయంగా ముచ్చటించారు. పింఛన్లు, రేషన్ బియ్యం అందుతున్నది లేనిది తెలుసుకొన్నారు. సీసీ రోడ్లు దాదాపు పూర్తి చేశామని తెలిపారు. సీఎం కెసిఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. ఇవి కొనసాగేందుకు మళ్ళీ కెసిఆర్ ను సీఎం చేయాలని, తనని మరోసారి దీవించాలని కోరారు.

640
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS