నేడు కాళేశ్వరం జలజాతర

Tue,July 16, 2019 07:28 AM

Jala Jathara at Kaleshwaram Project

-అన్నారం బరాజ్ వద్ద వనభోజనాలు..
-పాల్గొననున్న మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు
-ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే బాల్క సుమన్


హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు జలకళ సంతరించుకున్న నేపథ్యంలో చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కాళేశ్వరం జలజాతర పేరుతో మంగళవారం అన్నారం బరాజ్‌వద్ద సామూహిక వనభోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. కార్యక్రమానికి మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ పురాణం సతీశ్, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్ నియోజకవర్గ ప్రాంతానికి చెందిన పది వేల మంది కుటుంబాలతో సహా హాజరుకానున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే బాల్క సుమన్ సోమవారం పరిశీలించారు. కార్యకర్తలు, నేతలకు తగిన సూచనలు చేశారు. కార్యక్రమంలో పాల్గొనే మంత్రులు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు తొలుత మేడిగడ్డ, అన్నారం బరాజ్‌లు, కన్నెపల్లి పంపుహౌస్, గ్రావిటీ కెనాల్‌ను సందర్శిస్తారని నిర్వహకులు తెలిపారు.

988
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles