ట్రాఫిక్‌ ఉల్లంఘన..51 మందికి జైలు శిక్ష

Fri,March 15, 2019 07:41 AM

Jailterm to 51 members due to Traffic violations


హైదరాబాద్ : కూకట్‌పల్లి, బాలానగర్‌, మియాపూర్‌ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో ట్రాఫిక్‌ నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతున్న 51మందికి కూకట్‌పల్లి మెట్రో పాలిటన్‌ కోర్టు న్యాయమూర్తి శ్రీదేవి మూడు రోజుల నుంచి గరిష్టంగా 25రోజుల వరకు జైలు శిక్ష విధించారు. వీరితో పాటు డ్రైవింగ్‌ లైసెన్సు లేకుండా వాహనాన్ని నడుపుతున్న మరో 29మందికి రెండు రోజుల జైలు శిక్ష, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ చేస్తూ చిక్కిన మరో ఇద్దరికి రూ.వెయ్యి జరిమానా విధించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి శ్రీదేవి మాట్లాడుతూ ట్రాఫిక్‌ నిబంధనలను పాటించి సురక్షిత ప్రయాణం చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరంగా కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను నడిపి పట్టుబడితే డ్రైవింగ్‌ లైసెన్స్‌లను రద్దు చేస్తామని ఆమె హెచ్చరించారు.

988
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles