వరంగల్‌లో జైలు రేడియో

Thu,March 14, 2019 09:20 PM

వరంగల్: ఖైదీలు ఉల్లాసంగా గడిపేందుకు వరంగల్ సెంట్రల్ జైలులో జైలు రేడియో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. డీజీ వినయ్‌కుమార్ సింగ్ ఆదేశాల మేరకు జైలు రేడియో కేంద్రాన్ని సూపరింటెండెంట్ మురళీబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖైదీల జీవితంలో జరిగిన యధార్థ ఘటనలతో పాటు వారిలోని ప్రతిభను తోటి ఖైదీలతో పంచుకునేందుకు రేడియో కేంద్రాన్ని ప్రారంభించామని, రేడియా ప్రసారాలు జైలు ఆవరణకే పరిమితమన్నారు. రాష్ట్రంలో వరంగల్ సెంట్రల్ జైలులోనే మొట్టమొదటిసారిగా ప్రారంభించామన్నారు.

845
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles