ఐక్యరాజ్యసమితి మార్గదర్శకాలపై జైళ్లశాఖ కసరత్తుFri,November 24, 2017 07:09 AM
ఐక్యరాజ్యసమితి మార్గదర్శకాలపై జైళ్లశాఖ కసరత్తు

హైదరాబాద్ : ఖైదీల హక్కులు, నియమ నిబంధనలపై ఐక్యరాజ్యసమితి (యూఎన్) రూపొందించిన ప్రమాణాల అమలుకు జైళ్లశాఖ కసరత్తు చేస్తున్నది. ఖైదీగా జైలులో అడుగుపెట్టిన వెంటనే యూఎన్ ప్రమాణాలను వివరించడంతోపాటు విడుదలయ్యే సమయంలో జైలు సిబ్బంది పనితీరు పరిశీలనపై ఖైదీల నుంచి ప్రతిస్పందన తెలుసుకొనే విధంగా చర్యలు తీసుకుంటున్నది. ఇందుకు కావాల్సిన కసరత్తును ఇప్పటికే పూర్తిచేసిన జైళ్లశాఖ డీజీ వీకే సింగ్.. ప్రస్తుతం ముద్రణ పనిలో నిమగ్నమయ్యారు. ఖైదీల పట్ల క్రూరంగా వ్యవహరించవద్దని, మంచి ఆహారం అందించాలని, ఖైదీల కుటుంబసభ్యులకు, స్నేహితులకు ములాఖత్ అవకాశమివ్వాలని, దుస్తులు, బెడ్ వసతి కల్పించాలని, స్కిల్ డెవలప్‌మెంట్ అంశాల్లో శిక్షణ ఇప్పించాలని, వైద్యసేవలు అందించాలని ఐక్యరాజ్యసమితి పలు ప్రమాణాలను రూపొందించింది. అమలుకు సంబంధించిన చార్టులను వరంగల్‌లో ఆ శాఖ ముద్రిస్తున్నది. రాష్ట్రంలో మూడు కేంద్ర కారాగారాలు, ఏడు జిల్లా జైళ్లు, 30 సబ్‌జైళ్లు ఉన్నాయి. వాటిల్లో ప్రస్తుతం 5,800 మంది వివిధ రకాల ఖైదీలు ఉన్నారు.

791
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS