జగ్గారెడ్డి మరో భారీ మోసం వెలుగులోకి..

Wed,September 12, 2018 03:05 PM

jagga reddy another fraud on land sale

సంగారెడ్డి: మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అవినీతి బాగోతాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అమీన్‌పూర్ ఫ్రీడం ఫైటర్స్ భూ బాధితులు జాయింట్ కలెక్టర్, ఏఎస్పీ మహేందర్‌ను కలిశారు. స్వాతంత్య్ర సమరయోధులకు చెందిన 80 ఎకరాల భూమిని.. జగ్గారెడ్డి తమకు అమ్మి కోట్ల రూపాయలు తీసుకొని మోసం చేశాడని ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలని జాయింట్ కలెక్టర్‌ను బాధితులు కోరారు. నకిలీ పత్రాలతో జగ్గారెడ్డి మమ్మల్ని తప్పుదోవ పట్టించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. జగ్గారెడ్డిని ఎన్నిసార్లు కలిసినా మమ్మల్ని పట్టించుకోలేదని వాపోయారు. దీనిపై పూర్తి విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

12597
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS