పల్లెల అభివృద్ధితోనే దేశం అభివృద్ధి..

Tue,February 12, 2019 08:32 PM

Jagadishreddy Participates Gramasabha in Suryapeta constituency

సూర్యాపేట: సూర్యాపేట నియోజకవర్గం పరిధిలోని పెన్ పహాడ్ మండలం రంగయ్య గూడెంలో రెండో రోజు గ్రామ సభలో ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జగదీష్ రెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ తో కలిసి గ్రామాన్ని కాలినడకన చుట్టి వచ్చారు. గ్రామ సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. మౌలిక సదుపాయాల ఏర్పాటుకు అధికారులకు ఆదేశాలు జారీచేశారు. అనంతరం రెవిన్యూ రికార్డుల నవీకరణలో భాగంగా ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులపై జగదీష్ రెడ్డి మండిపడ్డారు. వచ్చే గ్రామ సభలో రెవిన్యూ రికార్డుల మీద ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని అధికారులను హెచ్చరించారు.

గ్రామ సభలో రికార్డుల నవీకరణపై జగదీష్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. అక్కడికక్కడే పట్టాల మార్పిడి చేయించి , రికార్డుల నవీకరణపై అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..రికార్డుల నవీకరణలో అలసత్వం వహించొద్దని రెవిన్యూ సిబ్బందిని హెచ్చరించారు. పట్టాలు సత్వరమే అందించాలని..పట్టాల పంపిణీలో నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. వివాదం ఉన్న భూములకు పట్టాలు ఆపాలని, వివాదరహితమైనవి ఉంటే వెంటనే పట్టాలు అందించాలని అధికారులకు నిర్దేశించారు. పట్టాల పంపిణీతోపాటు కంప్యూటర్ల తప్పిదాలతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. సర్వేయర్లు వెంటనే రంగంలోకి దిగి పిటిషన్ దారుల అర్జీలు క్లియర్ చెయ్యాలన్నారు. అధికారుల తప్పిదాలు రైతులకు శాపాలు కాకూడదు. అనువంశిక భూములలో నోటీసుల పేరుతో కాలాయాపన చేస్తే సహించేది లేదన్నారు.

వారసత్వంగా వచ్చే భూములలో వివాదాలు సృష్టిస్తే చర్యలు తప్పవని జగదీష్ రెడ్డి హెచ్చరించారు. మొదటి గ్రామ సభల్లో మందలింపులు మాత్రమే ఉంటాయి. వచ్చే నెలలో జరిగే గ్రామ సభలకు ఫిర్యాదులు పెండింగ్ లో ఉండకూడదన్నారు. గాంధీజీ కన్న కలలు సాకారమౌతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ బాపు బాటలోనే పల్లెల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. పల్లెలు అభివృద్ధి జరిగితేనే దేశం అభివృద్ధి చెందుతుందని నమ్మిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

1191
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles