నల్లగొండ జిల్లాలో తొలి నిమ్మ మార్కెట్: జగదీష్ రెడ్డి

Sun,June 17, 2018 03:34 PM

Jagadish reddy says about lemon market in nallagonda

నల్లగొండ: రాష్ట్రంలో తొలి నిమ్మ మార్కెట్ ను, బత్తాయి మార్కెట్లను సీఎం కేసీఆర్ నల్లగొండ జిల్లాలో ఏర్పాటు చేశారని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. నకిరేకల్ లో ఏర్పాటు చేసిన నిమ్మ మార్కెట్ (రాష్ట్రంలో తొలి నిమ్మ మార్కెట్) ను, ప్రాధమిక వ్యవసాయ భవనం గోదామును మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..నిమ్మ రైతుల బాధలు కాంగ్రెస్ నేతలకు ఇన్నాళ్లు కనపడలేదని మండిపడ్డారు. ఫ్లోరైడ్ పాపం కాంగ్రెస్ నాయకులదేనని ఆరోపించారు. కాంగ్రెస్ లో అందరూ సీఎం అభ్యర్థులేనని.. ప్రజలు నవ్వుకుంటున్నారని జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తుడుచుపెట్టుకుపోతుందన్నారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణి చేయాలని సీఎం కేసీఆర్ సాగు నీటి యజ్ఞం మొదలుపెట్టారు. అప్పు లేకుండా వ్యవసాయం చేసే రోజులు తెలంగాణలో వచ్చాయి. తెలంగాణకు కాంగ్రెస్ శాపంలా తయారైందన్నారు. పదవుల కోసమే కాంగ్రెస్ నేతల పోరాటం, ఆరాటమన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఎగిరేది గులాబీ జెండానేనని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ వాళ్లకు డిపాజిట్లు కూడా రావన్నారు.

1419
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles