కాంగ్రెస్ నాయకులపై మంత్రి జగదీష్‌రెడ్డి ఫైర్

Sat,December 17, 2016 03:31 PM

Jagadish reddy fire on Congress leaders

హైదరాబాద్ : కాంగ్రెస్ నాయకులపై విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి మండిపడ్డారు. శాసనసభలో విద్యుత్ అంశంపై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఇంకా తెలంగాణను చీకట్లోనే ఉంచాలని కాంగ్రెస్ నేతలు కుట్రలు చేస్తున్నారని మంత్రి ధ్వజమెత్తారు. విద్యుత్ ప్రాజెక్టులను కట్టనివ్వకుండా కాంగ్రెస్ నేతలు అడ్డుకుంటున్నారని తెలిపారు. సభలో లేని అంశాన్ని ముందుపెట్టి కాంగ్రెస్ సభ్యులు సస్పెండ్ చేయించుకున్నారని చెప్పారు. ప్రణాళిక లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో కాంగ్రెస్ నేతలకు ప్రణాళిక లేనందు వల్లే తెలంగాణ చాలా రకాలుగా నష్టపోయిందన్నారు. నార్త్ - సౌత్ గ్రిడ్ అనుసంధానం అక్కర్లేదని కిరణ్‌కుమార్‌రెడ్డి అంటే ఆనాడు కాంగ్రెస్ నాయకులు వంతపాడారని గుర్తు చేశారు. కాంగ్రెస్ నేతలకు ప్రణాళికలు ఉంటే.. చీకట్లు ఎందుకు కమ్ముకున్నాయని ప్రశ్నించారు. ఇప్పుడు తెలంగాణలో కరెంట్ సరఫరాకు ఆటంకం లేదన్నారు. తెలంగాణ ఏర్పడితే చీకట్లు అలుముకుంటాయని చేసిన దుష్ప్రచారంలో నిజం లేదని ప్రజలు గ్రహించారని తెలిపారు. ఇండ్ల మీద నుంచి పోయే కరెంట్ తీగలకు పరిష్కారం చూపిస్తామన్నారు. 60 ఏళ్లుగా విద్యుత్ సిబ్బందికి రక్షణ లేదన్నారు. విద్యుత్ సిబ్బంది ప్రమాదవశాత్తు చనిపోతే రూ. 20 లక్షలు పరిహారం ఇస్తామన్నారు.

1215
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles