తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో జడ్చర్ల వాసికి చోటు

Sat,June 15, 2019 09:51 PM

Jadcherla man named in telugu book of records

జడ్చర్ల: జాతీయ స్థాయిలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణానికి చెందిన వంశీ కృష్ణకు చోటు దక్కింది. హైదరాబాద్ కూకట్‌పల్లిలో జయసింహ మైండ్ ఎడ్యుకేషన్ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో వంశీకృష్ణ 5 నిమిషాల వ్యవధిలో 360 బైనరీ నంబర్లను గుర్తుంచుకుని కొత్త రికార్డు నమోదు చేశారు. దీంతో జాతీయస్థాయి తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో వంశీకృష్ణ చోటు దక్కించుకున్నట్లు తెలుగు బుక్ ఆఫ్ రికార్డు అధ్యక్షుడు వెంకటాచారి తెలిపారు.

320
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles