లంచం ఇస్తూ అడ్డంగా దొరికిపోయిన జేఏసీ కో కన్వీనర్Fri,January 12, 2018 08:02 PM
లంచం ఇస్తూ అడ్డంగా దొరికిపోయిన జేఏసీ కో కన్వీనర్

విజయవాడ: జేఏసీ నేతలు అవినీతిలో మునిగితేలుతున్నారు. వాళ్లు చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేవి మాత్రం తప్పుడు పనులు. లంచం ఇస్తూ ఏపీలోని విజయవాడలో జేఏసీ కో కన్వీనర్ గోపాల్ శర్మ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. కమర్షియల్ టాక్స్ జేసీకి లంచం ఇస్తూ ఆయన దొరికిపోయారు.

జేఏసీ నేతల అవినీతి వ్యవహారంపై ఏసీబీ డీజీ ఠాకూర్ ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభయింది. దీంతో ఐటీడీ సిమెంటేషన్ ఇండియా లిమిటెడ్ కంపెనీ డిప్యూటీ మేనేజర్ సత్యనారాయణ కంపెనీ లీగల్ అడ్వైజర్ గోపాల్ శర్మపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖ, గంగవరం పోర్టుల బెర్తుల నిర్మాణంలో ఐటీడీ సిమెంటేషన్ కంపెనీ పని చేస్తున్నది.

ఇది ట్రాప్ కాదు.. పక్కా సమాచారంతోనే దాడులు నిర్వహించాం... హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చిన గోపాల్ శర్మ డబ్బులు తీసుకొనే వచ్చారు. రూ. 22.02 లక్షల లంచం అంటే మామూలు కేసు కాదు..ఏసీబీ డీజీ ఠాకూర్

2437
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS