సెబాస్టియన్ ఇంటిపై ఐటీ అధికారుల దాడి

Thu,September 27, 2018 01:28 PM

IT raids in Sebastian's house in cash for vote case

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో నిందితుల్లో ఒకరైన సెబాస్టియన్ ఇంటిపై ఐటీ అధికారులు దాడి చేశారు. నగరంలోని కల్యాణ్‌నగర్‌లో సెబాస్టియన్ నివాసముంటున్న స్వస్తిక్ కాంప్లెక్స్ ప్లాట్‌లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. 2015 జూన్ 1న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా ఓటు వేయాలని కోరుతూ రేవంత్‌రెడ్డి డబ్బులను ఎరవేసి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ కోరాడు. ఈ క్రమంలో రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, రుద్ర ఉదయ్‌సింహా.. స్టీఫెన్‌సన్‌కు నగదు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు విచారణ పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇదే కేసు విషయంలో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి చెందిన ఇండ్లు, కార్యాలయాల్లో అదేవిధంగా అదేవిధంగా ఆయన బంధువుల ఇళ్లలో ఆదాయపు పన్నుశాఖ అధికారులు ఈ ఉదయం సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే.

2102
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles