టీఎస్ పోలీసులు దేశానికే ఆదర్శం: జయేష్ రంజన్

Mon,October 23, 2017 12:17 PM

IT Principal Secretary Jayesh Ranjan Praise to telangana police

హైదరాబాద్: హెచ్‌ఐసీసీలో సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ సమావేశం జరుగుతోంది. సమావేశాన్ని ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ ప్రారంభించారు. కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య, రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్, టీఎస్‌టీఎస్ ఎండీ వెంకటేశ్వరరావు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ భరణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయష్‌రంజన్ మాట్లాడుతూ... తెలంగాణ పోలీసులు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. టెక్నాలజీని వినియోగించుకుని కేసులు పరిష్కరిస్తున్నారు. సైబర్ కేసులు పరిష్కారించడంలో పోలీసులు ముందుంటున్నారు. ప్రజలకు సంబంధించిన సైబర్ సెక్యూరిటీ అంశంలో ప్రభుత్వం అలర్ట్‌గా ఉందని ప్రశంసించారు.

2024
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles