హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధి 17 శాతం : మంత్రి కేటీఆర్

Fri,September 20, 2019 06:22 PM

హైదరాబాద్ : అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన కంపెనీలు హైదరాబాద్‌కు వస్తున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. శాసనసభలో పరిశ్రమల పద్దుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. 2014-15లో ఐటీ ఎగుమతులు రూ. 50 వేల కోట్ల లోపే ఉన్నాయి. ఈ ఏడాది హైదరాబాద్ ఐటీ ఎగుమతులు రూ. లక్ష కోట్లు దాటాయి. బెంగళూరులో అద్భుతం జరుగుతుంటే అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌కు ఎందుకు వస్తున్నాయి?. బెంగళూరులో ఐటీ అభివృద్ధి 7-9 శాతం కాగా, హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధి 17 శాతం ఉంది.


2014 నుంచి ఇప్పటి వరకు ఐదేళ్లలోనే 59 ఇండస్ట్రీయల్ పార్కులు ఏర్పాటు చేశాం. తెలంగాణలో బోయింగ్ సంస్థ ఉత్పత్తి ప్రారంభించింది. సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో ఆసియాలోనే అతిపెద్ద స్టెంట్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేశాం. బెంగళూరు కంటే ఎక్కువ ఉపాధి అవకాశాలు మనం సృష్టించబోతున్నాం. అపాచీ, రాఫెల్ కంపెనీలు కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టాయి.

ఖమ్మం, కరీంనగర్‌లో ఏర్పాటు చేస్తున్న ఐటీ హబ్‌లు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి. తెలంగాణ యువతకు ఐటీ శిక్షణ ఇచ్చేందుకే టాస్క్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. జిల్లా కేంద్రాల్లోనూ టాస్క్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. పనితీరు బాగుంది కాబట్టే హైదరాబాద్ ప్రజలు టీఆర్‌ఎస్ స్పష్టమైన తీర్పు ఇచ్చారు. మన నగర అభివృద్ధిని మనమే తక్కువ చేసి చూపొద్దు అని మంత్రి కేటీఆర్ సూచించారు.

1129
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles