జనవరిలో ఇజ్రాయెల్ ప్రధాని భారత్ పర్యటన

Thu,November 23, 2017 10:21 PM

Israeli PM to visit India in January

జెరుసలేం : ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు జనవరిలో భారత్‌లో పర్యటించనున్నారు. నాలుగురోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు రానున్న ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు ముఖ్య నేతలను కలుసుకుంటారు. జనవరి 14న ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్‌కు రానున్న నెతన్యాహుకు ప్రధాని మోదీ స్వాగతం పలుకుతారు. భారత్, ఇజ్రాయెల్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మొదలైనప్పటి నుంచి భారత్ పర్యటనకు వస్తున్న రెండో ప్రధాని నెతన్యాహు. 2003లో ఇజ్రాయెల్ ప్రధాని ఏరియల్ షారోన్ భారత్‌లో పర్యటించారు. దాదాపు 14 ఏండ్ల తర్వాత ఆ దేశ ప్రధాని నెతన్యాహు భారత్‌కు వస్తున్నారు.

1038
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS