‘కొడంగల్‌లోని లక్షా 20 వేల ఎకరాలకు నీళ్లు’

Fri,October 20, 2017 10:03 PM

Irrigation water for Kodangal Constituency

వికారాబాద్: పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కొడంగల్ నియోజకవర్గంలోని లక్షా 20 వేల ఎకరాలకు సాగునీళ్లు ఇవ్వనున్నట్లు మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. కొడంగల్ స్థానిక టీడీపీ ప్రజాప్రతినిధులు, కార్యవర్గమంతా శుక్రవారం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. గత పాలకుల హయాంలో కొడంగల్‌లో తాగునీరు కూడా రాలేదని దుయ్యబట్టారు. పెండింగ్ ప్రాజెక్టులను సీఎం కేసీఆర్ పూర్తి చేస్తున్నరని చెప్పారు. మహబూబ్‌నగర్ ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ పథకాలకు ఆకర్షితులై టీఆర్‌ఎస్‌లో చేరుతున్నరన్నారు. కొత్త, పాత తేడా లేకుండా పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అందరం కలిసి సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని పేర్కొన్నారు.

1713
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles