నీటి పారుదల రంగానికి రూ.22500 కోట్లు

Fri,February 22, 2019 12:52 PM

Irrigation gets 22500 crores in interim Budget

హైదరాబాద్: సమైక్య రాష్ట్రంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ సాగునీటి రంగాన్ని కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ పట్టాలకు ఎక్కించింది. తొలి ఐదేళ్లలో చేపట్టిన ప్రాజెక్టులను చాలా వరకు పూర్తి చేయగలిగింది. ఇప్పుడు మరో ఐదేళ్లు కూడా సాగునీటి ప్రాజెక్టులకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. దీనికోసం ఈ ఏడాదికిగాను తాత్కాలిక బడ్జెట్‌లో సాగునీటి రంగానికి రూ.22,500 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. రానున్న ఐదేళ్లలో కృష్ణా, గోదావరిలలో తెలంగాణ వాటాను సమర్థంగా వినియోగించుకొని కోటీ 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తొలి నాలుగేళ్లలోనే ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేసిందని, 90 శాతం ప్రాజెక్టులు పూర్తయ్యాయని కేసీఆర్ తెలిపారు. అన్ని ప్రాజెక్టులకు అనుమతులను కూడా సంపాదించగలిగామని చెప్పారు. ఇక ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్ట్ నీటిని ఈ వర్షాకాలంలోనే అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. రానున్న ఐదేళ్లలో అన్ని ప్రాజెక్టులు పూర్తవుతాయని స్పష్టం చేశారు. మిషన్ కాకతీయ పథకంలో భాగంగా 20 వేలకుపైగా చెరువుల పునరుద్ధరణ జరిగినట్లు చెప్పారు. కాలువల పునరుద్ధరణ ద్వారా చెరువులకు పునర్ వైభవం తేనున్నట్లు స్పష్టం చేశారు.

1035
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles