నీళ్ల నిపుణుడు విద్యాసాగర్ రావు గురించి..

Sat,April 29, 2017 12:02 PM

Irrigation Expert R Vidyasagar Rao life history

హైదరాబాద్ :నీటిపారుద‌ల రంగ నిపుణుడు, రిటైర్డ్ చీఫ్ ఇంజినీరు, రాష్ట్ర నీటిపారుద‌ల స‌ల‌హాదారు ఆర్ విద్యాసాగ‌ర్‌రావు స్వగ్రామం న‌ల్లగొండ జిల్లా ఓల్డ్ సూర్యాపేట తాలూకాలోని జాజిరెడ్డి గూడెం. ఈ ఊరు మారుమూల గ్రామం. చాలా వెన‌క‌బ‌డ్డ ప్రాంతం. ఆయ‌న తల్లి ల‌క్ష్మమ్మ‌, తండ్రి ఆర్ రాఘ‌వ‌రావు. వారిది విద్యావంతుల కుటుంబం‌. ఆయ‌న తండ్రి అప్పటికే టీచ‌రు అయినందువ‌ల్ల ఆ కుటుంబంలో అంద‌రూ చ‌దువుకున్నారు. ఆ ఊళ్లో ఫ‌స్ట్ మెట్రిక్యూలేట్ వాళ్ల నాన్నన‌ట‌. ఫ‌స్ట్ గ్రాడ్యూయేట్ వాళ్ల అన్న‌. విద్యాసాగ‌ర్‌రావు వాళ్ల ఊళ్లో మొట్టమొద‌టి ఇంజ‌నీరింగ్ ప‌ట్టభ‌ద్రుడు. ఇలా ఆ కుటుంబంలో ఆయ‌న చెల్లెండ్లు కూడ అప్పట్లో ఒకామె సెవెన్త్ క్లాస్‌, ఇంకొకామె మెట్రిక్యులేష‌న్ చేశారు.

చిన్నప్పటి నుంచి ఆట‌లు, పాట‌లు, రాత‌ల‌న్నా విద్యాసాగ‌ర్‌రావుకు చాలా ఇష్టం. ఆరో త‌ర‌గ‌తిలోనే లోభి అనే క‌థ‌ను బాల‌ప‌త్రిక‌కు పాంపార‌ట‌. చిన్నప్పుడు గిరీషం అనే క‌లం పేరుతో ఆయ‌న రాసిన ర‌చ‌న‌లు చాలా ప‌త్రిక‌ల్లో అచ్చు అయ్యాయి. చ‌దువుకుంటూనే క‌వి స‌మ్మేళ‌నాలు, నాట‌కాలు చూడ‌టానికి వెళ్లేవార‌ట‌. కాలేజ్ కాంపిటేష‌న్స్‌లో నాటకాలు కూడా వేసేవార‌ట‌. నాట‌కాలంటే ఆయ‌న‌కు పిచ్చి. నాట‌కంలో పాత్ర వేయ‌కపోయినా స‌రే క‌నీసం క‌ర్టెన్ లాగినా అనంద‌ప‌డేవార‌ట‌.

టెన్త్ త‌ర్వాత నిజాం కాలేజీలో ఎంపీసీ చ‌దివారు. అనంత‌రం అంద‌రిలాగే ఆయ‌న కూడా ఇంజ‌నీరింగ్‌లో చేరారు. బీటెక్ అయిన వెంట‌నే క్యాంప‌స్‌లోని మ‌హిళా కాలేజీ మెయింటెనెన్స్ ఇంజీనీరుగా ఉద్యోగంలో చేరారు. ఉద్యోగంలో చేరిన త‌ర్వాత కూడా రాయ‌టం, నాట‌కాలు వేయ‌డం వంటి హాబీల‌ను ఆయ‌న వ‌దులుకోలేదు. రోజూ సాయంత్రం ఆయ‌న అడ్డా ల‌క్డీకాపూల్లోని ర‌వీంద్రభార‌తి. డ్యూటీ అయిపోయిన వెంట‌నే ఆయ‌న అక్కడికి చేరుకునేవార‌ట‌. హైద‌రాబాద్‌లో ఉద్యోగం అనంత‌రం ఢిల్లీకి వెళ్లారు. కేంద్రంలో మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్‌, నీటిపారుద‌ల శాఖ‌లో ఇంజ‌నీరుగా ప‌నిచేశారు. ఢిల్లీలో ఉండ‌గానే నీళ్ల విషయంలో తెలంగాణ‌కు జ‌రుగుతున్న అన్యాయాన్ని తెలుసుకున్నారు. రిటైర్మెంట్ త‌రువాత తిరిగి హైద‌రాబాద్ వ‌చ్చారు. అంత‌కు ముందు దాదాపు 34 సంవత్సరాల పాటు కేంద్ర జలసంఘంలోనే విధులు నిర్వహించడంతో ఆయనకు దేశవ్యాప్తంగా జల వనరుల అంశంపై అపారమైన అనుభవం గ‌డించారు.

3399
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles