ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో గంగ గయ సంగం యాత్ర

Thu,June 20, 2019 07:03 AM

irctc ganga gaya sangam yatra from hyderabad

హైదరాబాద్ : గంగ గయ సంగం యాత్ర పేరుతో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ లిమిటెడ్(ఐఆర్‌సీటీసీ) ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. ప్యాకేజీలో భాగంగా వారణాసి అండ్ ప్రయాగ్‌రాజ్ ప్రదేశాల సందర్శన ఉంటుంది. పూర్తిస్థాయి విమానయానం ద్వారా కొనసాగే యాత్రలో అనేక సౌకర్యాలు కల్పించనున్నారు. ఐతే ఈ ప్యాకేజీ లో భాగంగా యాత్రలో పాల్గొని వారణాసిలో పిండ ప్రదానం చేయాలనుకున్న వారు స్వంత ఖర్చులతో ఈ కార్యక్రమాన్ని చేసుకోవాల్సి ఉంటుందని ఐఆర్‌సీటీసీ ప్రకటనలో పేర్కొంది. ఈ యాత్ర కోసం ఒకొక్కరికీ (సింగిల్ ఆక్యుపెన్సీ) రూ.26050 గా నిర్ణయించారు. డబుల్ అక్యుపెన్సీలో భాగంగా ఒకొక్కరికీ రూ.19,290, ట్రిపుల్ ఆక్యుపెన్సీలో ఒకొక్కరికీ రూ.17,400, పిల్లలకు ఛైల్డ్ విత్ బెడ్ కోసం ఒక్కొక్కరికీ రూ.17,400, ఛైల్డ్ వితౌట్ బెడ్ రూ.14,620గా టికెట్ ధర నిర్ణయించారు.ఆగస్టు 11న హైదరాబాద్ నుంచి ప్రారంభమై నాలుగు రోజుల యాత్ర కొనసాగుతుంది. ప్యాకేజీలో భాగంగా విమాన టికెట్లు,బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్స్, సైట్‌సీయింగ్ కోసం ఏసీ బస్సు ఏర్పా టు, ట్రావెల్ ఇన్సూరెన్స్, టూర్ ఎస్కార్ట్ సౌకర్యాలు కల్పించబడుతాయి.

806
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles