త్వరలోనే బీబీనగర్ నిమ్స్‌లో ఐపీ సేవలు

Tue,October 3, 2017 09:51 PM

ip services in Bibinagar Nims hospital

హైదరాబాద్: బీబీనగర్ నిమ్స్ ఆస్పత్రిలో త్వరలోనే ఇన్‌ పేషెంట్ (ఐపీ) సేవలను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. సచివాలయంలో వైద్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి లక్ష్మారెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. కేసీఆర్ కిట్స్, ఉద్యోగ నియామకాలు, ఆశావర్కర్లకు ప్రోత్సాహకాలు వంటి తదితర అంశాలపై సమీక్ష చేపట్టిన మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైద్యారోగ్యశాఖలో కాంట్రాక్టు పద్దతిలో 2100 పోస్టుల భర్తీ చేయనున్నట్లు తెలిపారు. కేసీఆర్ కిట్ల పథకానికి ఉన్న డిమాండ్ రీత్యా మరిన్ని మాతా శిశు వైద్యశాలల కోసం ప్రణాళికలు రూపొందించాలన్నారు. అదేవిధంగా ఆశా వర్కర్ల ప్రోత్సాహకాలు సమయానికి అందేలా చూడాలని చెప్పారు. ఆశా వర్కర్లకు మరింత శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. వర్షాల నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబలకుండా సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

1767
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles