ప్రపంచ తెలుగు కార్టూన్ల ఎంపిక పోటీలకు ఆహ్వానం

Mon,March 18, 2019 09:47 PM

Invitation to the selection of World Telugu cartoons Competition

జూలపల్లి: రాష్ట్ర ప్రభుత్వం, భాషా సాంస్కతిక శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ తెలుగు కార్టూన్ల ఎంపిక కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్టూన్ల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల రాజమౌళి, జోనల్ కార్యదర్శి గుండు రమణయ్య తెలిపారు. ప్రపంచ నలుమూలల నుంచి తెలుగు కార్టూనిస్టులు ఏ 3 సైజ్ పేపర్‌పై ఒక్కొక్కరూ ఐదు చొప్పున స్వయంగా గీసిన కార్టూన్లను ఏప్రిల్ 10 లోగా పంపించాలని పేర్కొన్నారు. హాస్యం పలకరింపు, నాణ్యమైన కార్టూన్లకు అధిక ప్రాధాన్యత ఇస్తామనీ, ప్రతి కార్టూనిస్ట్ తాను సొంతంగా గీసిన చిత్రమని హామీ పత్రం ఇవ్వాలని సూచించారు. ఏప్రిల్ 24 నుంచి 28 దాకా హైదరాబాద్‌లోని ఐసీసీఆర్ ఆర్ట్స్ గ్యాలరీలో, రవీంద్రభారతిలో కార్టూన్లు ప్రదర్శిస్తామని తెలిపారు. పూర్తి వివరాలకు 98462 73799, 98494 66309 మొబైల్ నంబర్ల ద్వారా సంప్రదించ వచ్చని కోరారు.

437
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles