కాళేశ్వరం ప్రారంభోత్సవానికి ఫడ్నవీస్‌కు ఆహ్వానం

Wed,June 12, 2019 06:17 PM

Invitation to Fadnavis to the opening of Kaleshwaram project

హైదరాబాద్‌: ఈ నెల 21వ తేదీన జరిగే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా విచ్చేయాల్సిందిగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోరారు. ఈ మధ్యాహ్నం సీఎం కేసీఆర్‌.. దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఫోన్‌ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు ఫడ్ణవీస్‌ అంగీకరించారు. త్వరలోనే సీఎం స్వయంగా ముంబయి వెళ్లి దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఆహ్వానించనున్నారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం జగన్‌ను కూడా ఇప్పటికే సీఎం కేసీఆర్‌ ఆహ్వానించిన విషయం తెలిసిందే.

1920
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles