బీసీ రుణాల కోసం ఈ నెల 25న ఇంటర్వ్యూలు

Sat,June 23, 2018 10:07 PM

Interviews on 25th of this month for BC loans

అంబర్‌పేట: జీహెచ్‌ఎంసీ అంబర్‌పేట సర్కిల్ పరిధిలో(అంబర్‌పేట, హిమాయత్‌నగర్ మండలాలు) నివాసముంటూ 2017-18 సంవత్సరానికి గానూ బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 25వ తేదీ సోమవారం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు డీసీ బి.బాలయ్య తెలిపారు. రూ.లక్ష, రెండు లక్షల రుణం కోసం దరఖాస్తు చేసుకున్న వారు సోమవారం ఉదయం 11 గంటలకు అంబర్‌పేట ఛేనంబర్ చౌరస్తాలో గల మహారాణాప్రతాప్ ఫంక్షన్‌హాల్ నందు ఈ ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. దరఖాస్తుదారుడు సంబంధిత కులం, ఆదాయంతో పాటు ఒరిజినల్ సర్టిఫికేట్లు, ఆధార్ కార్డు, రేషన్‌కార్డులను తప్పక తీసుకొని రావాలని పేర్కొన్నారు.

3572
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles