అంతర్‌రాష్ట్ర దొంగ అరెస్ట్

Fri,July 19, 2019 09:31 PM

Interstate robbery arrest

ఖమ్మం : ఇంటికి తాళాలు వేసి ఉన్న ఇండ్లను పగలు రెక్కి నిర్వహించి రాత్రిపూట దొంగతనాలకు పాల్పడుతున్న ఆంధ్రా రాష్ర్టానికి చెందిన అంతర్‌రాష్ట్ర దొంగను పోలీస్‌లు అరెస్ట్ చేశారు. ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్థుడు, అంతర రాష్ట్ర దొంగను పోలీస్‌లు అరెస్ట్ చేసి కటకటాల వెనుకకు పంపించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని స్పెషల్ బ్రాంచ్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ వివరాలను వెల్లడించారు. ఆంధ్రా రాష్ర్టానికి చెందిన సిరిశెట్టి రవిచందర్(27) ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని పది ఇండ్లల్లో దొంగతనాలకు పాల్పడ్డాడు. సుమారు 10చోట్ల ఇండ్లలో తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడినట్లు ఆయన తెలిపారు. మధ్యాహ్నాం 1 గంటకు నగరంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్‌టీఆర్ సర్కిల్ వద్ద సీసీఎస్ పోలీసులు, టూటౌన్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పందంగా ఒక వ్యక్తి ఉండటంతో అతని విచారించగా ఖమ్మంలో చేసిన దొంగతనాలను వివరించాడు. సిరిశెట్టి రవిచందర్‌పై ఆంధ్రా రాష్ట్రంలోని వైజాగ్, గాజువాక, దువ్వాడ, పీఎంపాలెం పోలీస్‌స్టేషన్లలో పది కేసులు ఉన్నాయని సీపీ తెలిపారు. గతంలో జైలు జీవితం గడిపి బయటికి వచ్చిన తరువాత మళ్లీ దొంగతనాలకు పాల్పడ్డాడు. అదేవిధంగా ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని ఖమ్మం నగరంలో ఖానాపురం, రాపర్తినగర్, బ్యాంక్ కాలనీ, కవిరాజ్‌నగర్‌లో, వైరాలో పలు ఇండ్లల్లో దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించాడని తెలిపారు. అతని దగ్గర రూ.16.52లక్షల విలువైన 509గ్రాముల బంగారు వస్తువులు, మూడు కేజీల వెండి వస్తువులు, ఏపీ 05సీడీ 7030బజాజ్ పల్సర్ బైక్‌ను స్వాధీన పరుచుకొని అరెస్ట్ చేశామని తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలిస్తామన్నారు.

393
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles