హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఫొటోగ్రఫీ ఫెస్టివల్

Thu,August 23, 2018 12:13 PM

International Photography Festival in Hyderabad

హైదరాబాద్ : హైదరాబాద్ మరో అంతర్జాతీయ వేడుకకు వేదిక కానుంది. ది ఇండియన్ ఫొటోగ్రఫీ ఫెస్టివల్ -2018 (ఐపీఎఫ్) పేరిట దక్షిణాసియాలోనే భారీ ఫొటోగ్రఫీ ఫెస్టివల్ నిర్వహణ కోసం తెలంగాణ టూరిజంశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. వచ్చేనెల 6వ తేదీ నుంచి అక్టోబర్ 7వరకు స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఈ వేడుకలు నిర్వహించనున్నట్టు పర్యాటకశాఖ సెక్రటరీ బీ వెంకటేశం తెలిపారు. 25 దేశాల నుంచి 550 మంది ఫొటోగ్రాఫర్లు ఫెస్టివల్‌లో పాల్గొననున్నారన్నారు. వివరాల కోసం 99631 24445 /99633 71314 నంబర్లను సంప్రదించాలన్నారు.

668
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles