జనవరి 13 నుంచి కైట్స్ ఫెస్టివల్

Tue,January 8, 2019 03:38 PM

International Kites Festival Starts from January 13 at Parade Grounds

హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రతి ఏటా నిర్వహించే అంతర్జాతీయ పతంగుల పండుగ, మిఠాయి వేడుక నిర్వహణపై ఇవాళ సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. జనవరి 13 నుంచి 15వ తేదీ వరకు పరేడ్ గ్రౌండ్స్ లో అంతర్జాతీయ పతంగులు, స్వీట్ పండుగలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రతి రోజూ 3 లక్షల మంది సందర్శకులు వచ్చే అవకాశం ఉందని.. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా లేఅవుట్ రూపొందించుకొని పనులు చేయాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.

749
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles