అరకు వ్యాలీలో ఎయిర్ బెలూన్ ఫెస్టివల్..

Tue,November 14, 2017 01:08 PM

International Hot Air Balloon Festival begins in Araku Valley


విశాఖపట్నం: విశాఖపట్నంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం అరకువ్యాలీలో ఇంటర్నేషనల్ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది. టూరిజంను ప్రమోట్ చేయడంలో భాగంగా ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ జరుగుతున్నది. మూడు రోజులపాటు నిర్వహించనున్న ఎయిర్‌బెలూన్ ఫెస్టివల్‌ ఈవెంట్‌లో యూఎస్, స్విట్జర్లాండ్, జపాన్, మలేషియా, తైవాన్ సహా 13 దేశాలకు చెందిన పర్యాటకులు, ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఈవెంట్‌లో ఎయిర్‌బెలూన్స్ గరిష్టంగా సముద్రమట్టానికి 50వేల అడుగుల ఎత్తు వరకు వెళతాయని ఈవెంట్ ఆర్గనైజేషన్ ఈ-ఫ్యాక్టర్ సంస్థ సీఈవో సమిత్ జార్జ్ తెలిపారు. ఎయిర్‌బెలూన్స్ పైకి వెళ్లినపుడు సాంకేతిక సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు జార్జ్ తెలిపారు.
arakuvalley11

2507
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles