త్వరలో ఇన్నోవ్యాప్టివ్ గ్లోబల్‌ సొల్యూషన్ సెంటర్

Fri,March 8, 2019 07:03 AM

Innovaptive global Solution centre


తెలుగు యూనివర్సిటీ: ఇన్నోవ్యాప్టివ్‌ గ్లోబల్‌ సొల్యూషన్‌ భారత్‌లో వ్యాపార విస్తరణ చేపట్టిందని, తెలంగాణలో త్వరలోనే కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఇన్నోవ్యాప్టివ్‌ ఉపాధ్యక్షులు అభిషేక్‌ పర్కాల పేర్కొన్నారు. నగరంలోని ఓ హోటల్‌లో గురువారం ఆ సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు కల్పిస్తున్న తోడ్పాటు, ఉద్యోగ అవకాశాలను పరిశీలించేందుకు వచ్చిన బృందం సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్‌లో రాబోయే కాలంలో కోడ్‌- నో కోడ్‌ మార్కెట్‌లో ఉద్యోగ అవకాశాలు విస్తృతంగా ఉండబోతున్నాయని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో కంపనీల లాభాలను పెంపొందించుకోవడానికి ప్రతీ కంపెనీలో పనిలో నాణ్యత పెంపొందించాలని, క్రమశిక్షణ, ప్రోడక్ట్‌ ఖర్చు తగ్గించుకోవడం, పనిసామర్థ్యం పెరగడం అత్యవసరమని వివరించారు.

భారతీయ యువకులైన ఐబీఎం ఎగ్జిక్యూటివ్‌లు సందీప్‌ వి.రావడే, హరి పి.కామినేని 2012లో అమెరికాలో స్థాపించిన ఇన్నోవ్యాప్టివ్‌ బిజినెస్‌ టె బిజినెస్‌ ప్లాట్‌ ఫాంలో కొన్ని వందల క్లయింట్‌లను కలిగి ఉందని వివరించారు. సంస్థ ఫీల్డ్‌ ఉపాధ్యక్షులు మనోజ్‌కుంతా మాట్లాడుతూ.. ఈనెల 25న తెలంగాణలో జాతీ య స్థాయి కార్పొరేట్‌ కార్యాలయాన్ని ప్రారంభించి 350 పని స్థలాలతో ముం దుకు సాగుతున్నట్లు వెల్లడించారు. సైయెంట్‌ చైర్మన్‌ బి.వి మోహనరావు ప్రారంభిస్తారని తెలిపారు. సంస్థ జిఎం, హెచ్‌ ఆర్‌ ఆపరేషన్స్‌ ఇండియా అమాన్‌ఖాన్‌ తదితరులు పాల్గొని కంపనీ వివరాలతో కూడిన లోగోను ఆవిష్కరించారు.

561
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles