ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో

Sun,July 22, 2018 10:52 PM

Inflow to Sripada Yellampalli project

అంతర్గాం: పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టులోకి స్వల్పంగా నీరు పెరుగుతుంది. ప్రాజెక్టు సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, 13.087 టీఎంసీలు ఉండగా, 148.00 మీటర్లకు గానూ 145.20 మీటర్ల లెవల్‌కు చేరినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఉదయం 6 గంటలకు ఇన్‌ఫ్లో 3,242 క్యూసెక్కులు ఉండగా, సాయంత్రం ఇన్‌ఫ్లో 2,723 క్యూసెక్కులుగా ఉంది. కాగా, 658 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. ఇందులో ఎన్టీపీసీకి 121 క్యూసెక్కులు, హైదరాబాద్ మెట్రో వాటర్ స్కీంకు 280 క్యూసెక్కులు, సింగరేణి జైపూర్ విద్యుత్ సంస్థకు 125 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండటంతోపాటు 104 క్యూసెక్కుల సాధారణ నష్టం జరుగుతున్నట్లు తెలిపారు.

1380
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles