ఆహ్లాదకర వాతావరణం కోసం అర్బన్, ఆక్సిజన్ పార్కులు..

Mon,July 22, 2019 07:10 PM

indrakaran reddy review on urban ponds beautification


హైద‌రాబాద్ : పట్టణ ప్రాంత ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇచ్చేలా నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంతో పాటు దాని చుట్టుప‌క్క‌ల‌ అర్బన్, ఆక్సిజన్ పార్కులను తీర్చిదిద్దుతున్నట్లు అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి స్పష్టం చేశారు. గండి రామ‌న్న అర్బ‌న్ పార్క్, అడెల్లి నేచ‌ర్ పార్క్, ప‌ట్ట‌ణ‌ చెరువుల సుంద‌రీక‌ర‌ణ‌పై మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఇవాళ స‌చివాయంలోని ఆయ‌న చాంబ‌ర్ లో స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సమీక్షలో మంత్రి మాట్లాడుతూ...పట్టణ ప్రాంతాల్లో రోజు రోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్‌ రద్దీ, కాలుష్యాన్ని ప్రజలు తట్టుకునేందుకు, మెరుగైన జీవన విధానాన్ని అందుబాటులోకి తేవడమే తమ‌ ప్రయత్నమన్నారు. ఆ దిశగా అటవీ , మున్సిప‌ల్ శాఖ‌ అధికారులు అర్బన్, ఆక్సిజన్ పార్కులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అర్బన్ పార్కుతో పాటు ఆక్సిజన్ పార్కు పనుల వివరాలపై అటవీ శాఖ అధికారులను మంత్రి ఆరా తీశారు.

అర్బన్ పార్కులో మొక్కల పెంపకం, వాకింగ్ ట్రాక్, పాత్ వే, కానోఫి వాక్, తదితర పార్కు అభివృద్ధి అంశాలపై అటవీ శాఖ అధికారుల‌తో చర్చించారు. జిల్లాలో ప్రసిద్ధి గాంచిన శ్రీ అడెల్లి మహా పోచమ్మ ఆలయానికి స‌మీపంలో కార్తీక వ‌నం అభివృద్దిపై మంత్రి అధికారుల‌తో చ‌ర్చించారు. అడెల్లి పోచ‌మ్మ ఆల‌యానికి వ‌చ్చే భ‌క్తుల సంఖ్య రోజుకు రోజుకు పెరుగుతుంద‌ని, ఇక్క‌డ‌కు వ‌చ్చే భ‌క్తుల‌కు ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణాన్ని అందించేందుకు కార్తీక వ‌నాన్ని మ‌రింత అభివృద్ది చేయాల‌ని అధికారులకు సూచించారు. దీనికి అవ‌స‌ర‌మైన ప్ర‌తిపాద‌న‌లు రూపోందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ధ‌ర్మ‌సాగ‌ర్ మినీ ట్యాంక్ బండ్ వ‌ద్ద సుందరికరణ చేసి అక్కడికి వచ్చిన వారికి పిక్నిక్ పార్కులా, ఆహ్లాదం పంచేలా ఏర్పాట్లు చేయాల‌ని, జిప్ లైన్, సైక్లింగ్ చేయ‌డానికి , అనువుగా ఉండేలా ప్రణాళిక‌లు రూపొందించాల‌ని సూచించారు. కంచ‌రోని చెరువు సుంద‌రీక‌ర‌ణ‌కు రూ.80 ల‌క్ష‌ల‌తో అభివృద్ది ప‌నులు చేప‌ట్టామ‌ని, ఇవ‌న్ని ప‌నులు పూర్తైతే నిర్మ‌ల్ ప‌ట్ట‌ణ‌ స్వరూపం మారిపోయి సర్వాంగ సుందరంగా మారుతుందని ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఈ స‌మావేశంలో పీసీసీఎఫ్ పికే ఝా, సీఎఫ్ వో వినోద్ కుమార్,డీఎఫ్ వో ప్ర‌సాద్, జీహెచ్ ఎంసీ అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ కృష్ణ పాల్గొన్నారు.

774
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles