చిందు కళాకారుల సంక్షేమ సంఘం భవనానికి భూమిపూజ

Fri,September 14, 2018 01:32 PM

Indrakaran reddy lays foundation stone to Chindu artists Building at Sarangapur

నిర్మల్ : సమాజాన్ని చైతన్యపరచడంలో కళాకారుల పాత్ర గొప్పదని, వారి సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంద‌ని గృహ నిర్మాణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి అన్నారు. సారంగాపూర్ మండ‌లం శ్యాంఘ‌డ్ లో చిందు క‌ళాకారుల సంక్షేమ సంఘం భ‌వ‌న నిర్మాణానికి మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి శుక్రవారం భూమి పూజ చేశారు.

ఈ సంద‌ర్బంగా మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి మాట్లాడుతూ... కళలకు కాణాచి అయిన తెలంగాణలో చిందు కళాకారుల పాత్ర ఎంతో విశిష్టమైంద‌న్నారు. తరతరాలుగా కళామతల్లి సేవచేస్తూ ఉత్తర తెలంగాణకు వన్నె తెచ్చిన చరిత్ర చిందు కళాకారులదని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిందు కళాకారుల సంక్షేమం కోసం కృషి చేస్తోందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో చిందు కళాకారులకు తగిన వాటా దక్కేలా ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంద‌ని హామీ ఇచ్చారు.

749
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS