పంట న‌ష్టంపై మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఆరాTue,February 13, 2018 05:08 PM
పంట న‌ష్టంపై మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఆరా


హైద‌రాబాద్: అకాల వర్షం, వ‌డ‌గండ్ల‌తో పంటలు నష్టపోయిన రైతులు అధైర్య‌ప‌డ‌వ‌ద్ద‌ని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి సూచించారు. పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వ పరంగా స‌హాయం అందేలా కృషి చేస్తానని ఇంద్రకరణ్ రెడ్డి హామీనిచ్చారు. నిర్మ‌ల్, ముధోల్ నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లు మండ‌లాల్లో ఆకాల వ‌ర్షం, వ‌డ‌గండ్లతో జ‌రిగిన పంట న‌ష్టంపై మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ ఆరా తీశారు. జిల్లా క‌లెక్ట‌ర్ ఎం ప్ర‌శాంతి, జిల్లా వ్య‌వ‌సాయ శాఖ అధికారి డి అమ‌రేష్ కుమార్ తో మంత్రి పోన్ లో మాట్లాడి..పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు.

క్షేత్ర‌స్థాయిలో పర్యటించి ఆకాల వర్షం వల్ల నష్టపోయిన పంట పొలాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. పంట న‌ష్టం వివ‌రాల‌ను సేక‌రించి, వ్య‌వ‌సాయ శాఖ క‌మిష‌న‌ర్ కు నివేదించాల‌ని అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. నిర్మ‌ల్ జిల్లాలో అకాల వ‌ర్షం వ‌ల్ల 10,770 ఎక‌రాల్లో పంట న‌ష్టం జ‌రిగిన‌ట్లు ప్రాథ‌మికంగా ఓ అంచ‌నాకు వ‌చ్చిన‌ట్లు వ్య‌వ‌సాయ శాఖ అధికారి మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డికి వివ‌రించారు. 8,017 ఎక‌రాల్లో మొక్క జొన్న‌, 1655 ఎక‌రాల్లో శ‌న‌గ, 700 ఎక‌రాల్లో జొన్న‌ పంట‌కు న‌ష్టం వాటిల్లింద‌ని తెలిపారు.

659
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Union Budget 2018