ఫ్యాన్లు పంపిణీ.. పట్టుబడ్డ స్వతంత్ర అభ్యర్థి

Mon,February 1, 2016 06:25 AM

Independent candidate Anand kumar arrested by Jeedimetla police

హైదరాబాద్ : జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని సూరారం డివిజన్‌లో స్వతంత్ర అభ్యర్థి ఆనంద్‌కుమార్ ఓటర్లకు ఫ్యాన్లను పంపిణీ చేశారు. ఫ్యాన్లను పంపిణీ చేస్తుండగా ఆనంద్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆనంద్ నివాసంలో ఉన్న 170 ఫ్యాన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిన్నటి వరకు జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం కొనసాగిన విషయం విదితమే. ఫిబ్రవరి 2న పోలింగ్ జరగనుంది.

1343
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles