కవ్వాల్‌లో భద్రత పెంచండి

Thu,February 21, 2019 07:33 AM

హైదరాబాద్ : కవ్వాల్ పెద్దపులుల అభయారణ్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలను తీసుకోవాలని అటవీశాఖ అధికారులను హైకోర్టు ఆదేశించింది. అభయారణ్యంలోని కోర్, బఫర్ జోన్ల పర్యవేక్షక బాధ్యతను ఫీల్డ్ డైరెక్టర్‌కే అప్పగించాలని సూచించింది. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న కవ్వాల్ రిజర్వ్ ఫారెస్టు.. జిల్లాల పునర్విభజన తర్వాత ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ కుమ్రంభీం, మంచిర్యాల పరిధిలోకి వచ్చింది. కోర్, బఫర్ జోన్లు గతంలో ఫీల్డ్ డైరెక్టర్ పరిధిలో ఉండగా.. ప్రస్తుతం నాలుగు జిల్లాల పరిధిలోకి వచ్చినందున ఫీల్డ్‌ డైరెక్టర్ పరిధి తగ్గించారు. దాంతో పెద్దపులుల రక్షణపై ఫీల్డ్‌ డైరెక్టర్‌కు ఆజమాయిషీ లేకుండా పోతున్నదని కొందరు కోర్టుకెక్కారు. స్పెషల్ టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్‌ను త్వరలో ఏర్పాటు చేయాలని కోర్టు సూచించింది.

767
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles