రేవంత్ అక్రమాస్తులు ఇంకెన్నో..

Thu,September 27, 2018 02:48 PM

Income Tax Officials rides in Reventh Reddy houses at Kodangal and Jubleehills

హైదరాబాద్ : కాంగ్రెస్ నాయకుడు రేవంత్‌రెడ్డి నివాసాల్లో ఆదాయపు పన్ను శాఖ ఇవాళ ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, కొడంగల్‌లోని ఆయన నివాసాలతో పాటు మొత్తం 15 చోట్ల ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మనీలాండరింగ్‌కు రేవంత్‌రెడ్డి పాల్పడ్డారని ఈ క్రమంలో అతను, అతని బంధువులపై దర్యాప్తు జరపాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కు న్యాయవాది రామరావు ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం నుంచి రేవంత్‌రెడ్డి నివాసాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. శ్రీసాయి మౌర్య ఎస్టేట్స్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో రూ. 66 లక్షలు రేవంత్ పెట్టుబడి పెట్టారు. రేవంత్‌రెడ్డి మరో 8 మందితో కలిసి 2003లో ఈ కంపెనీని ఏర్పాటు చేశారు. 2010లో చివరిసారిగా ఐటీ లెక్కలు చూపించారు. 18 షెల్ కంపెనీలకు డబ్బు దారి మళ్లించారు. 2014 ఎలక్షన్ ఆఫిడవిట్‌లో మౌర్య కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్లు రేవంత్ పేర్కొన్నారు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీలకు చెందిన అధికారులను మభ్యపెట్టి రేవంత్ మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని ఈడీకి రామరావు ఫిర్యాదు చేశారు.

2010 తర్వాత శ్రీసాయి మౌర్య కంపెనీ ఎలాంటి బ్యాలెన్స్ షీట్ చూపలేదని టీన్యూస్‌తో న్యాయవాది రామరావు పేర్కొన్నారు. ఆదాయ పన్ను శాఖకు దొరకకుండా వందల కోట్ల లావాదేవీలు జరిగాయి. జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ సొసైటీలో జరిగిన అక్రమాలు నేనే బయటపెట్టాను. 19 కంపెనీల ద్వారా 200 నుంచి 300 కోట్లు మనీలాండరింగ్‌కు పాల్పడ్డారు. విదేశీ లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు మా వద్ద ఉన్నాయి. రేవంత్‌రెడ్డి అక్రమ సంపాదన, అక్రమ ఆస్తులు ఇంకెన్నో బయటపడాల్సి ఉంది అని న్యాయవాది రామారావు తెలిపారు.

6675
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles