హైదరాబాద్ : కాంగ్రెస్ నాయకుడు రేవంత్‌రెడ్డి నివాసంలో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసంలో నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు ఐటీ అధికారులు విస్తృతంగా సోదాలు చేసిన విషయం విదితమే. మళ్లీ ఇవాళ ఉదయం నుంచి సోదాలు ప్రారంభమయ్యాయి. రేవంత్ అనుచరుడు ఉదయ్‌సింహాకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. సోమవారం తమ ఎదుట హాజరు కావాలని ఉదయ్ సింహాను అధికారులు ఆదేశించారు. మరో అనుచరుడు సెబాస్టియన్‌ను విచారించిన ఐటీ అధికారులు.. మరోసారి అక్టోబర్ 1న హాజరు కావాలని ఆదేశించారు.