సిద్దిపేటలో సమీకృత మార్కెట్‌ ప్రారంభం

Wed,February 6, 2019 01:42 PM

Inaugurated integrated Market by Harish Rao in Siddipet

సిద్దిపేట : సిద్దిపేట పట్టణంలో సమీకృత మార్కెట్‌ను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఇవాళ ప్రారంభించారు. వినియోగదారుడికి సకల సౌకర్యాలతో అన్ని సరుకులు ఒకే చోట లభించే విధంగా సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్‌ను సిద్దిపేట పట్టణంలోని కరీంనగర్ రోడ్డులోని పాత వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో రూ. 20 కోట్లతో 6.10 ఎకరాల విస్తీర్ణంలో సమీకృత మార్కెట్‌ను నిర్మించారు. తెలంగాణలోనే తొలి ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ఇది. ఈ మార్కెట్ ప్రారంభంతో కూరగాయలు, పండ్లు, పాలు, మాంసం, చేపలు, నిత్యావసర సరుకులన్నీ ఒకే చోట అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వ పరంగా రాష్ట్రంలో సిద్దిపేట, గజ్వేల్‌లో సమీకృత మార్కెట్ల నిర్మాణాలు చేపట్టారు.

సమీకృత మార్కెట్‌లో వసతులు
సిద్దిపేట సమీకృత వెజ్ అండ్ నాన్ మార్కెట్‌లో మొత్తం 4 విభాగాలు ఉన్నాయి. 1. కూరగాయల రిటైల్, హోల్‌సేల్ ప్రాంగణం, 2. నాన్ మార్కెట్, 3. చేపల విక్రయాలు, 4. కూరగాయలను విక్రయించే విధంగా నాలుగు విభాగాలను రూ.20 కోట్లతో నిర్మించారు. మార్కెట్‌లో 17 వాణిజ్య దుకాణాలతోపాటు 21 హోల్‌సేల్ దుకాణాలను ఏర్పాటు చేశారు. చేపల విక్రయాలకు 17 స్టాల్స్, రిటైల్ కూరగాయల వ్యాపారుల కోసం 10 స్టాల్స్‌ను నిర్మించారు. వీటితోపాటు 92 స్టాల్స్‌తో నాన్ మార్కెట్‌ను ఏర్పాటు చేశారు. నాన్ మార్కెట్‌లో ప్రతి స్టాల్ కు మంచినీటి కనెక్షన్‌తోపాటు లాకర్ సదుపాయం ఏర్పాటు చేశారు. వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తకుండా డిజిటల్ ధరల పట్టికలను ఏర్పాటు చేశారు. వీమార్ట్ సూపర్ మార్కెట్‌ను ఏర్పాటు చేశారు. వాణిజ్య దుకాణ సముదాయాలకు బహిరంగ వేలం వేసి వ్యాపారులకు అప్పగించారు.

విశాలమైన పార్కింగ్, రెస్టాంట్, బంక్వేట్ హాల్
మార్కెట్‌కు ఎక్కువ సంఖ్యలో వినియోగదారులు వస్తుంటారు కనుక మార్కెట్ ప్రాంగణంలో పార్కింగ్ ఇబ్బంది లేకుండా రెండు చోట్ల పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు. దీంతో పాటు 3 చోట్ల మరుగుదొడ్లను నిర్మించారు. మార్కెట్ ప్రాంగణం ముందు భాగాన్ని కార్పొరేట్ కార్యాలయాల తరహాలో ఆధునీకంగా నిర్మించారు. మార్కెట్‌లో 2 మంచినీటి ప్లాంట్లను నిర్మించారు. పచ్చదనం ఉండేలా మొక్కలను సైతం నాటి గ్రీనరి ఏర్పాటు చేశారు. తెలంగాణలోనే కార్పొరేట్ తరహాలో సిద్దిపేటలో నిర్మించిన మొదటి ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ మార్కెట్. మార్కెట్‌లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిఘా పెట్టనున్నారు. రైతులు, వినియోగదారులు, వ్యాపారుల కోసం రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. శుభకార్యాలకు, మార్కెట్, వ్యాపారుల సమావేశాలకు బంక్వేట్ హాల్‌ను నిర్మించారు.


2858
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles