మెరుగైన వైద్యం కోసం రెండంచెల విధానం అమలు: మంత్రి ఈటెల

Sun,November 17, 2019 10:32 PM

హైదరాబాద్: వైద్యవృత్తిలో మెరుగైన సేవల కోసం ప్రభుత్వం రెండంచెల విధానం అమలు చేయబోతోందని వైద్యారోగ్య శాఖామంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. డాక్టర్ల రక్షణ కోసం ప్రవేశపెట్టిన 2011 ఆర్డినెన్స్ దేశానికి దిక్చూచిగా మారిందని మంత్రి తెలిపారు. ఆరోగ్యశ్రీ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి అన్నారు. ఆరోగ్యశ్రీ బకాయిల విషయంలో ప్రైవేటు ఆస్పత్రులకు ఎలాంటి ఆందోళన అవసరం లేదని మంత్రి అన్నారు. వైద్య వృత్తిలో ఒత్తిడి లేని వాతావరణాన్ని కల్పించేలా సంస్కరణలు తీసుకురాబోతున్నట్లు మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వైద్యులకు రక్షణ కల్పిస్తుందని మంత్రి తెలిపారు. అదే విధంగా అన్ని రకాల ఉద్యోగుల భద్రత ప్రభుత్వం చూసుకుంటుందని మంత్రి అన్నారు.

345
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles